లాల్‌కితాబ్ సిద్ధాంతం ప్రకారం మన జీవితంలో వచ్చే *ఋణాలు, ఆర్థిక అడ్డంకులు* ప్రధానంగా
* శని గ్రహ దోషం (ఋణబాధ)
* రాహు ప్రభావం (అసమంజస ఖర్చులు, అప్పులు)
* చంద్ర బలహీనత (మనసు అస్థిరత, నిర్ణయ లోపం)
వలన కలుగుతాయి.
*మహా శివరాత్రి రాత్రి* ఈ గ్రహ ప్రభావాలను శాంతింపజేసి, శివ తత్త్వాన్ని ఆవాహన చేసుకునే అత్యంత శక్తివంతమైన సమయం. ఈ రాత్రి లింగోద్భవ కాలంలో చేసిన పరిహారం గ్రహ బంధనాలను కరిగించి, ఆర్థిక ప్రవాహాన్ని మళ్ళీ ప్రారంభిస్తుంది.
—
🕉 పరిహార విధానం:
1️⃣ శివరాత్రి రోజు ఉపవాసం లేదా ఒకపొద్దు ఉండాలి.
2️⃣ సాయంత్రం 7:30 కు శుద్ధ స్నానం చేసి, స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి.
3️⃣ రాత్రి 12 గంటలకు (లింగోద్భవ కాలం) నుండి తెల్లవారు ఝాము 3:30 వరకు,
*స్పటిక లింగం* పై చెరుకు రసం తో అభిషేకం చేయాలి.
4️⃣ అభిషేక సమయంలో నిరంతరం
👉 నమః శివాయ మంత్రం జపించాలి.