ఉదయం లేవగానే ఈ మంత్రాలు పఠిస్తే రోజంతా గొప్పగా గడుస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపదు. సానుకూల దృక్పథం ఉంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి.
ప్రతిరోజూ మంచి రోజు కావాలని అందరూ కోరుకుంటారు. ఉదయాన్నే లేచి తమకు ఈరోజు బాగుండాలని ప్రార్థించేవారు ఎందరో ఉంటారు. సానుకూలతలను మీవైపు ప్రసరింపజేసే శక్తి ఈ ప్రార్థనకు ఉంది. ప్రార్థన అంటే మరేమిటో కాదు అది కూడా కొన్నిక్షణాల పాటు ఏకాగ్రతతో చేసే ఒక ధ్యానం లాంటిది. సనాతన ధర్మాలలో మానసిక ప్రశాంతతను కలుగజేసే ప్రార్థనలు, జపించటానికి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. రోజు ఎంత బాగా ప్రారంభమైతే ఆ రోజంతా అంత బాగుంటుందని అంటారు. మరి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం ద్వారా అది మీ వ్యక్తిగత జీవితానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది.
మన అరచేతుల్లో ముక్కోటి దేవతలు ఉంటారని చెబుతారు. అరచేతి కొనలో లక్ష్మి (శ్రేయస్సు దేవత) నివసిస్తుంది, మధ్యలో సరస్వతి (జ్ఞాన దేవత) నివసిస్తుంది. అలాగే అడుగుభాగంలో గౌరి (జీవిత దేవత) నివసిస్తుంది. కాబట్టి, మీరు నిద్రలేచిన వెంటనే మీ అరచేతిని చూసి, ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.
ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయానికి ముందు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించే ముందు, చేతిని చూస్తూ అరచేతులను చదవాలి.
“కరాగ్రే వసతు లక్ష్మీ, కరామధ్యే సరస్వతి,
కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర దర్శనం!”
తరువాత భూదేవి ప్రార్థన చేయాలి. మన భారాన్ని మోసేది భూమాత. నిద్రలేవగానే మొదటి అడుగు నేలపై పెట్టే ముందు ఓ భూతల్లి మమల్ని క్షమించమంటూ ఆ తల్లిని ప్రసన్నము చేసుకొనే ప్రార్థన చేయాలి.
“సముద్ర వాసనే దేవి, పర్వత స్థాన మందితే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పద స్పర్శం క్షమాశ్వమే!”
సూర్యుడు సకల జీవాలకు కనిపించే దేవుడు. శక్తికి మూలం సూర్యభగవానుడే. కాబట్టి ఉదయం లేవగానే సూర్యోదయం సమయంలో తూర్పువైపుకి తిరిగి దీర్ఘాయువు, సంపద, తెలివితేటల ప్రసాదించాలని సూర్య భగవానుణ్ని ప్రార్థించాలి.
“భానో, భాస్కర మార్తాండ, చంద రస్మయి, దివాకరా.
ఆయుర్, ఆరోగ్యం, బుద్దిమ్, శ్రీ యమశ్చ దేహి మే!”
స్నాన సమయంలో చదువలసిన మంత్రము
“శ్లో… గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురుII”
దయచేసి ఇవి వీలైతే చేయండి , చేయడానికి ప్రయత్నించండి . రోజంతా postive గా ఉంటుంది
ఒకే సారి అవ్వక పోవచ్చు , కానీ మెల్ల మెల్లగా అలవాటు చేసుకోండి . అద్భుతాలు చూస్తారు
